Logo

గోప్యతా విధానం (Privacy Policy)

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం, 2023 కి అనుగుణంగా తయారుచేయబడింది.

మన ఊరు యాప్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ కింద పేర్కొన్న గోప్యతా విధానానికి అంగీకరిస్తున్నారని అర్థం. మేము మీ డేటాను ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము మరియు రక్షిస్తాము అనేది ఇక్కడ వివరించబడింది.

Divider

1. మేము సేకరించే వ్యక్తిగత సమాచారం

  • •గుర్తింపు & సంప్రదింపు: మీ పేరు, ఈమెయిల్ మరియు ఫోన్ నంబర్.
  • •ప్రాంత వివరాలు: మీకు స్థానిక కంటెంట్ మరియు సేవలను చూపించడానికి మీ రాష్ట్రం, జిల్లా, మండలం మరియు పిన్‌కోడ్.
  • •కమ్యూనిటీ & మార్కెట్ డేటా: మీరు కమ్యూనిటీ బోర్డ్ లో పెట్టే పోస్టులు, కామెంట్లు, మార్కెట్‌లో పెట్టే వస్తువులు, రియల్ ఎస్టేట్ లిస్టింగ్స్.
  • •ఆఫర్ల సమాచారం: మీరు ఆఫర్ పెడితే — వ్యాపార రకం, ఆఫర్ వివరాలు, షాప్ పేరు, ఫోన్ నంబర్, WhatsApp లభ్యత, చిరునామా, మండలం, గడువు తేదీ మరియు ఒక ఫోటో (ఐచ్ఛికం).
  • •డైరెక్టరీ సమాచారం: సర్వీస్ ప్రొవైడర్లు & వ్యాపారులు ఐచ్ఛికంగా WhatsApp నంబర్, పని వేళలు, అనుభవం, Google Maps లింక్, GST నంబర్ మరియు షాప్ ఫోటో/లోగో జోడించవచ్చు.
  • •ఉద్యోగాల సమాచారం: ఉద్యోగాల కోసం సృష్టించిన రెజ్యూమ్‌లు, విద్య మరియు నైపుణ్యాలు.
  • •రక్తదాతల సమాచారం (ఐచ్ఛికం): మీరు రక్తదాతగా నమోదు చేసుకుంటే మీ బ్లడ్ గ్రూప్ మరియు నంబర్.

2. పబ్లిక్ మరియు ప్రైవేట్ సమాచారం

  • •పూర్తిగా ప్రైవేట్: మీ ఈమెయిల్, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ టోకెన్లు, మరియు పేమెంట్ వివరాలు ఎవరికీ కనిపించవు.
  • •పబ్లిక్ సమాచారం: మీరు డైరెక్టరీలో రిజిస్టర్ చేసుకున్న వ్యాపార వివరాలు, మార్కెట్ ప్లేస్‌లో లిస్ట్ చేసిన వస్తువులు, మీరు పెట్టిన ఆఫర్లు (ఫోన్, WhatsApp, చిరునామా, ఫోటోతో సహా) మరియు కమ్యూనిటీలో చేసిన పోస్టులు ఆ మండలంలోని అందరికీ కనిపిస్తాయి.
  • •ఉద్యోగ దరఖాస్తులు: మీ రెజ్యూమ్ డేటా మీరు దరఖాస్తు చేసిన యజమానులకు (Employers) మాత్రమే పంచుకోబడుతుంది.
  • •రక్తదాతలు: 'Private' ఎంచుకుంటే మీ నంబర్ ఎవరికీ కనిపించదు, కేవలం సిస్టమ్ ద్వారా మ్యాచ్ అయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది.

3. మీ డేటాను ప్రాసెస్ చేయడానికి గల ఉద్దేశ్యం

  • •ఖాతా నిర్వహణ: ఫైర్‌బేస్ (Firebase) ద్వారా సురక్షిత లాగిన్ అందించడానికి.
  • •లొకేషన్ ఫిల్టరింగ్: మీ మండలం పరిధిలోని ఆఫర్లు, పోస్టులు మరియు ఉద్యోగాలను చూపించడానికి.
  • •ఆఫర్లు: గడువు ముగియని నిజమైన ఆఫర్లను మాత్రమే చూపించడానికి, స్పామ్ నివారణ పరిమితులు అమలు చేయడానికి (నెలకు 10 ఆఫర్లు, ఒకేసారి 5 లైవ్) మరియు నకిలీ ఆఫర్ల రిపోర్టులను పరిశీలించడానికి.
  • •కమ్యూనిటీ బోర్డ్: ఆటోమేటిక్ ఫిల్టర్ల ద్వారా అసభ్య పదాలను నిరోధించడానికి మరియు కమ్యూనిటీని సురక్షితంగా ఉంచడానికి.
  • •నోటిఫికేషన్లు: కొత్త ఉద్యోగాలు, కమ్యూనిటీ రిప్లైలు మరియు ముఖ్యమైన అప్‌డేట్‌లను పంపడానికి.

4. సమ్మతి మరియు యాప్ పర్మిషన్లు (DPDP చట్టం)

  • •మీరు సెట్టింగ్స్ > ప్రైవసీ ద్వారా ఎప్పుడైనా మీ సమ్మతిని (Consent) ఉపసంహరించుకోవచ్చు.
  • •కెమెరా & స్టోరేజ్: ప్రొఫైల్ ఫోటోలు, షాప్ ఫోటోలు, ఆఫర్ ఫోటోలు, మార్కెట్ ప్లేస్ వస్తువులు అప్‌లోడ్ చేయడానికి. అప్‌లోడ్ చేసే ముందు ఫోటోను క్రాప్ చేసుకోవచ్చు.
  • •ఫోన్ డయలర్: యాప్ నుండే నేరుగా వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు కాల్ చేయడానికి.

5. డేటా షేరింగ్ & అడ్వర్టైజింగ్ (థర్డ్-పార్టీలు)

  • •మేము మీ డేటాను ఏ బ్రోకర్లకు విక్రయించము. సురక్షితమైన డేటాబేస్ కోసం మాత్రమే Google (Firebase) ని ఉపయోగిస్తాము.
  • •యాడ్స్ (Ads): మేము మూడవ పక్షాల (Google AdMob వంటివి) యాడ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించము. యాప్‌లో కనిపించే బ్యానర్ యాడ్స్ పూర్తిగా మన ఊరు ద్వారా స్థానిక వ్యాపారులకు నేరుగా అమ్ముకోబడతాయి.
  • •చట్టపరమైన అవసరాలు ఉంటే, పోలీసుల అభ్యర్థన మేరకు డేటాను పంచుకునే హక్కు మాకు ఉంది.

6. డేటా నిల్వ & శాశ్వత తొలగింపు (Right to Erasure)

  • •మీరు యాప్‌లోని 'Settings > Delete Account' ద్వారా మీ అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేసుకోవచ్చు.
  • •అకౌంట్ డిలీట్ చేసిన వెంటనే మీ ప్రొఫైల్, రెజ్యూమ్, కమ్యూనిటీ పోస్టులు, మార్కెట్ లిస్టింగ్స్, ఆఫర్లు మరియు వాటి ఫోటోలు మా సర్వర్ల నుండి శాశ్వతంగా తొలగించబడతాయి.
  • •ఆఫర్లు మీరు ఎంచుకున్న గడువు (గరిష్టంగా 30 రోజులు) తర్వాత ఆటోమేటిక్‌గా కనిపించవు.
  • •చెల్లింపు రికార్డులు భారతీయ పన్ను నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల పాటు ఉంచబడతాయి. అనలిటిక్స్ డేటా 14 నెలల తర్వాత తొలగించబడుతుంది.

7. భద్రతా ప్రమాణాలు

  • •మీ డేటా పూర్తిగా Google Cloud సర్వర్లలో ఎన్‌క్రిప్ట్ (AES-256) చేయబడి స్టోర్ చేయబడుతుంది. డేటా బ్రీచ్ జరిగితే 72 గంటల్లో Data Protection Board కు తెలియజేస్తాము.

గ్రీవెన్స్ ఆఫీసర్ & సంప్రదించండి

Name: Mana Ooru Grievance Officer

Email: manaooruapp05@gmail.com

Near Sankar Matam, Ponnur, Guntur District, Andhra Pradesh, India — 522124

ఐటీ నిబంధనలు (2021) ప్రకారం, మేము మీ ఫిర్యాదును 24 గంటల్లో స్వీకరించి, 15 రోజుల్లో పరిష్కరిస్తాము.

వర్షన్ 2.7 (ఆఫర్లు, నెలకు 3 ఉచిత జాబ్ పోస్టులు) • సెప్టెంబర్ 2026